Breaking News

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!

Published on Thu, 03/13/2025 - 16:49

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నేటితో(గురువారం)  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థ/ల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో  ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగీవ్రమైంది.  మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ఉండగా, వీరిపై పోటీకి ఎవరూ సిద్ధం కాలేదు. దాంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లకు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించగా, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యంలు అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా ఒక సీటును సీపీఐకి ఇచ్చింది కాంగ్రెస్. రెండు స్థానాలను సీపీఐ అడిగినప్పటికీ ఒక స్థానమే సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. వీరి మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొత్తు కుదిరింది. దాంతో సీపీఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించక తప్పలేదు. 

అయితే ఉపసంహరణ  గడువు ముగియడంతో  అధికారిక ప్రకటన వెలువడింది. ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు  ధ్రువీకరణ పత్రాలు అందించారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)