Breaking News

కరీంనగర్‌లో పొన్నం ట్యాక్స్‌

Published on Wed, 06/12/2024 - 05:27

సాక్షి, హైదరాబాద్‌: రామగుండం ఎన్‌టీపీసీ విద్యు త్‌ కేంద్రం నుంచి ఫ్లైయాష్‌ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో రేవంత్, పొన్నం ట్యాక్స్‌ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్‌ సంజయ్‌తో కలిసి తెలంగాణభవన్‌లో కౌశిక్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.

బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్‌ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్‌ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్‌ తరలించినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్‌లోడ్‌తో వెళుతు న్న ఫ్లైయాష్‌ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్‌ విద్యార్థి అఖిల్‌ మరణించాడన్నారు. 

ఎన్‌టీపీసీ వివరాలు దాచిపెడుతోంది 
ఫ్లైయాష్‌ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్‌టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్‌లోడ్‌ దందాపై బీఆర్‌ఎస్‌ కేడ ర్‌ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్‌బుక్‌లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్‌రావుపై ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)