Breaking News

లోక్‌సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి

Published on Mon, 05/13/2024 - 15:14

పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశారు.

'మిసా భారతి' లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు  రోడ్‌షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.

మిసా భారతి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి