Breaking News

మేనల్లుడికి మరోసారి మాయావతి షాక్‌

Published on Sun, 03/02/2025 - 21:19

ఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌కు మరోసారి ఝలక్‌కు ఇచ్చారు. తాజాగా, ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తతో పాటు అన్నీ పదవుల నుంచి తొలగించారు. 

గతేడాది ఆకాష్‌ ఆనంద్‌కు ఇదే పదవిలో కొనసాగుతుండగా.. తొలగిస్తూ మాయావతి అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి నియమించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి బాధ్యతల నుంచి ఆకాష్‌ నుంచి పార్టీ పదవుల నుంచి తొలగించారు మాయావతి. ఆకాష్‌  స్థానంలో ఆయన తండ్రి ఆనంద్ కుమార్, సీనియర్ నాయకుడు రామ్‌జీ గౌతమ్‌లను జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్‌ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్‌ మరింత పరిణితి పొందాల్సిన  అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  తర్వాత  జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది.  

ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్‌ ఆనంద్‌ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)