Breaking News

ఆకాష్‌పై అలక వీడిన మాయావతి

Published on Sun, 06/23/2024 - 13:39

మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌పై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అలక వీడాడు. ఆమె తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆమె మేనల్లుడు ఆకాష్ అత్త మాయావతి పాదాలను తాకి, ఆశీర్వదించాలని కోరారు. దీంతో ఆమె ఆనందంతో పొంగిపోతూ ఆకాష్ తలపై చేయివుంచి, నిండుగా ఆశీర్వదించారు.

అలాగే మాయావతి ఆకాష్ వీపు తడుతూ ఇకపై జాగ్రత్తగా ఉండు అనేలా సంకేతమందించారు. దీనికితోడు అతనిని రాబోయే ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేశారు. ఆకాష్‌ ఆనంద్‌ బీఎస్పీ మాజీ జాతీయ సమన్వయకర్త.

గతంలో మాయావతి ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా ప్రకటిస్తూ యూపీ, ఉత్తరాఖండ్ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను  అప్పగించారు. అయితే ఆకాష్‌ ఎన్నికల సమయంలో సీతాపూర్‌లో వివాదాస్పద ప్రసంగం చేయడంతో అతనిని జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. అయితే ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఆమె ఆకాష్‌పై అలకవీడి స్టార్ క్యాంపెయినర్‌గా  ఎంపికచేసి, పార్టీలో తగిన స్థానం కల్పించారు. 
 

#

Tags : 1

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)