Breaking News

ఏం చేస్తారో వరుణ్‌ గాంధీనే అడగండి: మేనకా గాంధీ

Published on Tue, 04/02/2024 - 07:28

లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎ‍న్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్‌  స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్‌ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు.

‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా నాకు టికెట్‌ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్‌? లేదా సుల్తాన్‌పూర్‌?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’ అని  మేనకా గాంధీ అన్నారు. 

టికెట్ ప్రకటించిన తర్వాత  మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్‌పూర్‌ సెగ్మెంట్‌లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉ‍న్న కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై వరణ్‌ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్‌ గాంధీ తన నియోజకవర్గ  ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్‌ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)