Breaking News

మానకొండూర్‌ (ఎస్సి) నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!

Published on Mon, 07/31/2023 - 11:00

మానకొండూర్‌ (ఎస్సి) నియోజకవర్గం

మానకొండూరు రిజర్వుడ్‌ నియోజకవర్గంలో ప్రముఖ గాయకుడు, తెలంగాణ సాంస్కతిక సంస్థ చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ పై 31509 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. రసమయికి 88997 ఓట్లు వస్తే, మోహన్‌కు 57488 ఓట్లు వచ్చాయి. కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోహన్‌ కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇక్కడ నుంచి ఎస్‌.ఎఫ్‌ బి టిక్కెట్‌పై పోటీచేసిన ఎమ్‌. ప్రబాకర్‌కు 13600 ఓట్లు దక్కాయి. 2014లో కూడా బాలకిషన్‌, మోహన్‌ల మద్యే పోటీ జరిగింది. 2009లో గెలిచి శాసనసభలో విప్‌గా పనిచేసిన ఆరేపల్లి మోహన్‌ను 2014లో రసమయి 46922 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ ఎన్నికలో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి డాక్టర్‌ కవ్వంపల్లి సత్య నారాయణకు 23627 ఓట్లు వచ్చాయి.

నేరెళ్ల (2009లో రద్దు) నేరెళ్ల  నియోజకవర్గం 2009లో  రద్దయిపోయింది. 2004 వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో గొట్టె భూపతి రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలిస్తే, పాటి రాజం కాంగ్రెస్‌ఐ అభ్యర్ధిగా మూడుసార్లు గెలిచారు. 1994,1999లో ఇక్కడ నుంచి గెలిచిన సుద్దాల దేవయ్య 2009లో చొప్పదండి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పాటి రాజం గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లలో పనిచేసారు. సుద్దాల దేవయ్య చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2004లో ఎన్నికైన కాశీపేట లింగయ్య టిఆర్‌ఎస్‌ అసమ్మతి నేతగా మారారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్‌కుమద్దతు ఇచ్చి విఫ్‌ ఉల్లంఘన అభియోగానికి గురై శాసనసభ్యత్వానికి అనర్హులవడం రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు. అయితే తీర్పు రావడానికి ఒక రోజు ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. పాస్‌పోర్టు కుంభకోణానికి సంబంధించి కూడా లింగయ్య అరెస్టు అయ్యారు. నేరెళ్లలో పదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి నాలుగుసార్లు టిడిపి రెండు సార్లు, టీఆర్‌ఎస్‌ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు.

మానకొండూర్‌ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)