Breaking News

ఇద్దరు ఎంపీల రగడ.. ‘ఆమెతో టైమ్‌ వేస్ట్‌.. ’

Published on Sun, 08/10/2025 - 19:58

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎంపీల మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీఎంసీ ఎంపీలు కళ్యాణ్‌ బెనర్జీ-మహువా మొయిత్రాల మధ్య రగడ హద్దులు దాటింది. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై మరో టీఎంసీ ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక టైమ్‌ వేస్ట్‌ మనిషి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

ఇటీవల లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ చీప్‌ విప్‌ పదవికి రాజీనామా చేసిన కళ్యాణ్‌ బెనర్జీ.. మహువా మొయిత్రా టార్గెట్‌గా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ ఆమె గురించి మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోను. ఆమె ఒక వేస్ట్‌. నేను దృష్టి సారించేంతగా ఆమెకు ఏ లక్షణాలు లేవు. ఆమె కారణంగా నేను చాలా మంది వద్ద చెడ్డవాడిగా మారిపోయాను. ఇప్పుడు మరోసారి ఆమె గురించి మాట్లాడటం అనవసరం. నా సమయం వేస్ట్‌ చేయకండి’ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఈ క్రమంలోనే తన అడ్వొకేట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ నా అడ్వొకేట్‌ నాకు ఒక మెస్సేజ్‌ చేశారు. నేను దానితో స్ఫూర్తి పొందాను. నేను ఎక్కువగా దృష్టి నిలపాల్సిన స్థాయి మొయిత్రాకు లేదు. నాకు ఇప్పుడు చాలా పని ఉంది’ అంటూ పేర్కొన్నారు. 

కాగా, ఈ ఏడాది జూన్‌ నెలలో కళ్యాణ్‌ బెనర్జీ మహిళా ద్వేషి అంటూ మొయిత్రా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలపై కళ్యాణ్‌ బెనర్జీ అగ్గిమీడ గుగ్గిలమయ‍్యారు. ‘ ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? అంటూ నిలదీశారు. ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

మొయిత్రా వ్యాఖ్య‌ల‌పై క‌ళ్యాణ్ బెన‌ర్జీ అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

వీరిద్ద‌రూ బ‌హిరంగంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకున్న సంద‌ర్భాలు గతంలో కూడా చాలానే ఉన్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)