Breaking News

బీజేపీతో ఇబ్బందులకు గురయ్యా: మహువా మొయిత్రా

Published on Thu, 06/13/2024 - 11:33

ఢిల్లీ: బీజేపీ తనను టార్గెట్‌ చేసి మరీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున కృష్ణానగర్‌ సెగ్మెంట్‌లో పోటీ చేసిన మొయిత్రా..  బీజేపీ అభ్యర్థినిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలుపొందిన అనంతరం ఆమె తొలిసారి ఓ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ‘‘ నేను సిస్టరెక్టమీ (ఆపరేషన్‌ ద్వారా గర్భసంచి తొలగింపు) సర్జరీ చేసుకున్నాను.  అప్పటికి నేను సర్జరీ చేసుకొని కేవలం ఎనిమిది రోజులు అవుతోంది. ఆ సమయంలో నాకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాంటి సయయంలో కూడా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు’’ అని మొయిత్రా చెప్పుకొచ్చారు.

 

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసిన మహువా మొయిత్రా.. బీజేపీ అభ్యర్థిని అమిత్‌ రాయ్‌పై 56705 ఓట్లు మేజార్టితో గెలుపొందారు. బీజేపీతో తాను ఎదుర్కొన్న కష్టాలను సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని గతేడాది డిసెంబర్‌ 8న లోక్‌సభ స్పీకర్‌ రద్దు చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ దోషిగా తేలుస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో  స్పీకర్‌ ఆమెపై వేటు వేశారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటంపై టీఎంసీతో సహా విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. 

ఎంపీ సభ్యత్వం రద్దు అయిన వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. ఆమెకు కేయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. అనంతరం మొయిత్రాను ప్రభుత్వ బంగ్లాను నుంచి ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)