Breaking News

Loksabha Elections 2024: ‘మహువా’ మళ్లీ గెలిచేనా !

Published on Mon, 03/25/2024 - 11:52

కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్‌ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. 

తాజాగా ఆదివారం(మార్చ్‌ 24) ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్‌ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్‌కి కేటాయించింది.  ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్‌ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్‌ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు.

కృష్ణా నగర్‌ బీజేపీ టికెట్‌ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్‌ కృష్ణచంద్రరాయ్‌ వంశానికి చెందినవారే.  నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్‌కి కృష్ణానగర్‌ టికెట్‌ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు.

మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్‌, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్‌ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్‌.. నటి పాత ట్వీట్‌ వైరల్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)