Breaking News

Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ

Published on Mon, 11/11/2024 - 12:48

నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా  కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వాట్‌ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్‌లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.

తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ‍గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది.  తాజాగా
కిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్  ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో  ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు  స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్‌ బూత్‌ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు.  ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)