Breaking News

నేల మీదకు రండి! 

Published on Sat, 11/04/2023 - 03:17

ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నెన్నో హామీలతో కూడిన మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నా,  వాటిలో ఎక్కడా కూడా భూమి ఎజెండా కావడం లేదు. ఇందుకు కారణాలేవైనా తెలంగాణలో భూమి చుట్టూ తిరగాల్సిన రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోందని వర్తమాన పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారించాల్సిన అంశాలపై తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో–2023 పేరుతో తెలంగాణ సమాఖ్య 15 కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. లీఫ్స్‌ సంస్థ, గ్రామీణ న్యాయపీఠం, తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరం నిర్వహించిన తెలంగాణ భూమి కారవాన్, భూన్యాయ శిబిరాలు, న్యాయగంట, చర్చా వేదికల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల అభిప్రాయాల ఆధారంగా ఈ డిమాండ్లను పార్టీల ముందుంచింది. 

మూడే కీలకం.. 
ఆ ఒకటే రికార్డు–ఒకటే పట్టా–ఒకటే చట్టం నినాదాన్ని ఎన్నికల ఎజెండా చేయాలని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇది సాధ్యమైతే 90 శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని అంటున్నారు. ఒకటే రికార్డు కావాలంటే భూముల సమగ్ర సర్వే జరగాలి. ఒకటే పట్టా కావాలంటే ప్రభుత్వమే టైటిల్‌ గ్యారంటీ ఇవ్వాలి. ఒకటే చట్టం కావాలంటే రెవెన్యూ కోడ్‌ అమల్లోకి రావాలి. ఇవి మూడూ జరగాలంటే రాజకీయ నిబద్ధత కావాల్సిందే.

వీటితో పాటు లా కమిషన్, సర్వీస్‌ కమిషన్, స్టేట్‌ఫైనాన్స్‌ కమిషన్‌ తరహాలో భూ కమిషన్‌ ఏర్పాటు డిమాండ్‌ కూడా ఉంది. కౌలు–వ్యవసాయ భూముల చట్టం (1950) ప్రకారం అధికారులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో ఈ కమిషన్‌ ఏర్పాటు తప్పనిసరి. అయితే 1950 నుంచి ఓ దశాబ్దంపాటు అమల్లో ఉన్న ఈ కమిషన్‌ ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది.  

భూమికి సంబంధించిన ఇతర డిమాండ్లు ఇవి
ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని సవరించి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించి పట్టాలివ్వాలి. 
 పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలను అందించాలి. 
 భూపంపిణీకి ప్రత్యేక పథకం రూపొందించాలి.  సీలింగ్‌ చట్టంతో మిగులు భూమిని భూమిలేని వ్యవసాయ పేద కుటుంబాలకు పునఃపంపిణీ చేయాలి. 
 భూవివాదాల పరిష్కారానికి  జిల్లాకో భూమి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుతోపాటు పేదలకు ఉచిత న్యాయ సాయం, పారాలీగల్‌ పథకాలను అమలు చేయాలి.  
ధరణి సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించాలి. కంప్యూటర్‌లో ఉన్న భూరికార్డులు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులను సత్వరమే సవరించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలి. కంప్యూటర్‌లో ఉన్న రికార్డులకు భద్రత కల్పించాలి. 
 నిషేధిత జాబితా (22ఏ)లో పొరపాటున నమోదైన పట్టా భూములను వెంటనే జాబితా నుంచి తొలగించాలి.
 గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపర్చాలి. అవసరాలకు తగినట్టు వారికి తగిన శిక్షణ ఇవ్వడం కోసం భూ అకాడమీని ఏర్పాటు చేయాలి. 
 భూవిధానం, భూమి వినియోగ విధానం, 2014లో చేసిన భూసేకరణ చట్టం యథాతథంగా అమలు చేయాలి.  
 కౌలుదారులను సాగుదారులుగా గుర్తించి వారికి పట్టా రైతులుగా అందాల్సిన అన్ని రకాల సాయం అందించాలి. కొత్త కౌలు చట్టం రూపొందించాలి.  

‘సర్వే’జనా..! 
భూముల సమగ్ర సర్వే కూడా రాజకీయ ఎజెండా కావాల్సిందేననేది రైతుహితుల అభిప్రాయం. గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్‌లలో భూసర్వే జరిగింది. ఏపీలో జరుగుతున్న సర్వే దక్షిణాదిలో ఉత్తమమైన సర్వేగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే భూముల సమగ్ర సర్వే చేసిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది. తెలంగాణలో ఈ సర్వే చేసేందుకు 2016లో రూ.580 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పుడు అది రూ.800 కోట్లకు చేరింది.

శాటిలైట్, డ్రోన్, డీజీపీఎస్‌ (డిజిటల్‌ జియో పొజిషనింగ్‌ సిస్టమ్స్‌)ల ద్వారా గ్రామ సరిహద్దులు, హైస్కేల్‌ మెజర్‌మెంట్స్‌ తీసుకొని యునీక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఎల్‌పిన్‌) లేదా ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్‌ ఇవ్వడం ద్వారానే భూమి హక్కులకు భద్రత కలగనుంది. ఇక మరో కీలకాంశం అసైన్డ్‌ భూములకు పట్టా హక్కుల కల్పన. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో, కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌లో ఈ అంశం పొందుపర్చారు.

భూ బదలాయింపు (పీఓటీ) చట్టాన్ని సవరించడం ద్వారా ఆ భూములు కేటాయించిన 20 ఏళ్ల తర్వాత ఏపీ, కర్ణాటకల్లో, 15 ఏళ్ల తర్వాత తమిళనాడులో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో కూడా 1950 నుంచి పేదలకు అసైన్‌ చేసిన 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి. ఈ భూములపై హక్కులకల్పన రాజకీయ ఎజెండా అయితే పేదల ఆర్థిక ముఖచిత్రంలో ఊహించని మార్పులు రానున్నాయి. 

-మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)