Breaking News

జగన్‌ అద్భుత నాయకుడు

Published on Fri, 04/11/2025 - 05:45

సాక్షి, హైదరాబాద్‌: ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన నాయకుడు.. జీవితంలో ఆయన అత్యంత కఠిన సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ 2.0ను చూస్తున్నాం’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వూ్యలో కవిత మాట్లాడుతూ, వైఎస్‌ జగన్, పవన్‌ కళ్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు.

‘పవన్‌ కళ్యాణ్‌ను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దురదృష్టవశాత్తూ ఆయన పొరుగు రాష్ట్రం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన గురించి అన్నీ ప్రశ్నించాలి్సన అంశాలే. చెగువేరాను ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతన వాదిగా ఎలా మారతాడు. ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకు వెళ్లి హిందీని రుద్దకూడదు అని కూడా అంటాడు. 

అందుకే పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు. ఆయనను సీరియస్‌ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. ‘దళిత మహిళ కాబట్టే హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటాను అన్నాడు. లోకేశ్‌ హోంమంత్రిగా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసేవాడా’ అని కవిత ప్రశ్నించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)