Breaking News

కరూర్‌ తొక్కిసలాట.. విజయ్‌కు భారీ షాక్‌?

Published on Sun, 09/28/2025 - 16:27

చెన్నై: తమిళగ వెట్రి కగళం (టీవీకే) అధినేత విజయ్‌కు భారీ షాక్ తగిలింది. కరూర్ (TVK chief Vijay at Karur rally) విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదివారం (సెప్టెంబర్‌28) సాయంత్రం 4.30 గంటలకు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుందని సమాచారం. 

తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన కరూర్‌ తొక్కిసలాట. శనివారం సాయంత్రం విజయ్‌ నిర్వహించిన సభకు హాజరై ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కొద్దిసేపటి క్రితం 40మందికి చేరింది. 100మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 48మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్యను కరూర్‌ జిల్లా కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించారు. 

అయితే, ఈ దుర్ఘటనలో విజయ్‌పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కరూర్‌ విజయ్‌ సభలో జరిగిన తొక్కిసలాట కేవలం ప్రమాదం కాదని, సభ నిర్వాహాణ లోపం, సభకు హాజరైన ప్రజల ప్రాణాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు టీవీకే అధినేత ఎలాంటి రాజకీయ సభలు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరుతూ కరూర్‌ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

సామాజిక కార్యకర్త సెంథిల్‌ కన్నన్ సైతం‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సెంథిల్‌ కన్నన్‌ తన పిటిషన్‌లో ‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది. అంటే, ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందువల్ల, టీవీకే పార్టీ భవిష్యత్‌లో నిర్వహించే ర్యాలీలకు  అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’ అని కోర్టును కోరారు.

విజయ్‌ పర్యటన రద్దు
మరోవైపు వచ్చేవారం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్‌ తన రాజకీయ పర్యటనను రద్దు చేసుకున్నారు. కరూర్‌ తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు. పరామర్శ కోసం విజయ్‌ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)