Breaking News

Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..?

Published on Tue, 04/18/2023 - 11:18

బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.1,139 కోట్లు అని తెలిపారు. అలాగే తనకు రూ.263 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 2018తో పోల్చితే ఈసారి ఆస్తుల విలువ 67 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించిన కాంగ్రెస్ నేతల్లో డీకే దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

తన వద్ద ఓ కారు, రెండు ఖరీదైన వాచ్‌లు, 2 కేజీల బంగారం, 12 కేజీల వెండి ఉన్నట్లు కన్నడ పీసీసీ చీఫ్ వెల్లడించారు. అలాగే తనపై 19 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. వీటిలో 13 కేసులు గత మూడేళ్లలోనే నమోదైనట్లు పేర్కొన్నారు.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న షాజియా తర్రానుమ్ తన ఆస్తుల విలువ రూ.1,629 కోట్లు అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈయన తర్వాత రెండో స్థానంలో బీజేపీ నేత ఎంటీబీ నాగరాజ్ ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.1,607 కోట్లు అని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 10న జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ఉంది. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది.
చదవండి:  లింగాయత్‌ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్‌ వైపు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు