Breaking News

ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా

Published on Sun, 05/19/2024 - 12:03

దేశంలో ప్రస్తుతం 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, కొన్ని స్థానాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ రంగంలోకి దిగారు.

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వచ్చినా, రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని, అప్పుడు తనకు ‘ఎంపీ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. భవిష్యత్తులో తనకు ఏదైనా మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా పెద్ద పదవి  అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని అన్నారు. తాను ముందుగా మండి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

కంగనా తన సినిమా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, తన కొత్త సినిమా ‘ఎమర్జెన్సీ’ త్వరలోనే విడుదల కాబోతున్నదని కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం కారణంగా తాను హీరో ఆర్ మాధవన్‌తో చేస్తున్న సినిమాకు గ్యాప్‌ ఇచ్చానని తెలిపారు. దానిని తిరిగి ప్రారంభించాల్సి ఉందని, అలాగే మరో మూడునాలుగు సినిమాలకు సైన్‌ చేశానని తెలిపారు.

యాపిల్ పండించే రైతుల గురించి కంగనా మాట్లాడుతూ, వారికి కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యాపిల్ ధరల పెంపు తదితర విషయాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందన్నారు. బీజేపీ అభ్యర్థిగా సొంత వాగ్దానాలు చేయకూడదని  పార్టీ ఆదేశించిందన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)