Breaking News

‘నిరూపిస్తే.. మీ ఇంట్లో గులాంగిరీగా పనిచేస్తా.. లేకపోతే...’

Published on Tue, 04/08/2025 - 16:42

హనుమకొండ జిల్లా:  కావాలనే తన క్యారెక్టర్ దెబ్బతీయడానికి ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కలిసి అభూత కల్పనలు స్పష్టిస్తున్నారని విమర్శించారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను అవినీతికి, కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆ ఇద్దరికీ చీము నెత్తురు ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

దేవునూర్ గుట్టల వ్యవహారంపై  హన్మకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  కడియం శ్రీహరి మీడియా సమావేశం మాట్లాడుతూ  ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై విరుచుకుపడ్డారు. ‘ నేను, నా కుటుంబ ఆక్రమిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ
ఆ భూములను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే కబ్జా అనడం సిగ్గుచేటని కడియం ఆరోపించారు

ఆధారాలు ఉంటే ప్రజలు ముందు పెట్టాలని తప్పు ప్రచారం చేసే పత్రికలకు, చానెల్స్ కు, వ్యక్తులకు ఆధారాలు ఉంటే బయట పెట్టలని  డిమాండ్ చేసారు. నిజమని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి జీనామా చేస్తా. లేదంటే న్యాయపరంగా వెళ్లాడనికి వెనకడను అని హేచ్చరించారు. 30 ఏళ్ల రాజకీయాలలో ఒక గంట కబ్జా చెయ్యలేదని, ఆధారాలు నిరూపిస్తే పల్లా, తాటికొండ రాజయ్యల ఇంట్లో గులాంగీరీగా పనిచేస్తా  అని కడియం అన్నారు. ఆధారాలు నిరూపించకపోతే నా ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య గులాంగిరి చెయ్యాలని డిమాండ్ చేశారు

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు