Breaking News

ఏ పార్టీ ఓటర్లు ఉదాసీనం? జేపీ నడ్డా ఏమన్నారు?

Published on Sat, 06/01/2024 - 08:06

2024 లోక్‌సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్‌ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.

దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.

దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో  ఓటింగ్‌శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ‍ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు