Breaking News

ఈ రెండు రోజులూ కీలకం

Published on Mon, 11/27/2023 - 03:52

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్న 111 (జనసేన 8 సీట్లు కలిపితే 119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా సమీక్షించారు. చివరి రెండు రోజుల ప్రచారం ఎంతో కీలకమని, ఉధృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు పోల్‌ మేనేజ్‌ మెంట్‌పై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పోల్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పోలింగ్‌ బూత్‌ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇందుకు రాష్ట్ర పార్టీకి జాతీయనాయకత్వం చేదోడువాదోడుగా నిలుస్తుందని నడ్డా భరోసానిచ్చినట్టు చెబుతున్నారు. ఆదివారం నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నడ్డా, తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విధుల్లో నిమగ్నమైన జాతీయనేతలు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్, సంస్థాగత సహ ఇన్‌చార్జి శివప్రకాష్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌తో సమావేశమయ్యారు.

ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు.. చివరి రోజుల్లో పార్టీకి ప్రజల్లో పెరిగిన మద్దతును ఓట్ల రూపంలో పోలింగ్‌బూత్‌ల దాకా తీసుకెళ్లి విజయం సాధించడం మరొక ఎత్తు అని పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాలు నిర్వహించిన తర్వాత పరిస్థితిలో అనూహ్యంగా మార్పు వచ్చిందని, అభ్యర్థుల విజయావకాశాలు చాలా సీట్లలో మెరుగయ్యాయని వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. 

ఆ సీట్లపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ 
45–50 స్థానాల్లో అభ్యర్థులు గట్టి పోటీనిస్తున్నారని, వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం  ద్వారా తెలంగాణలో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుందని నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో పరిస్థితి ఏమిటి అని నడ్డా ప్రశ్నించినపుడు ఆ రెండుచోట్లా కేసీఆర్‌కు బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ  ఇస్తున్నారని, గెలిచే అవకాశాలూ ఉన్నాయని ప్రకాష్‌జవదేకర్, సునీల్‌బన్సల్‌ వెలిబుచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)