Breaking News

జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌

Published on Sun, 03/24/2024 - 13:35

పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్‌లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్‌ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్‌ రాజీవ్‌ రంజన్‌(లలన్‌) సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.

ఈయన ముంగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్‌​ కేటాయించారు.

ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్‌ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్‌ కుమార్తె 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)