Breaking News

సర్పంచ్‌ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం..

Published on Wed, 06/21/2023 - 15:08

సాక్షి, వరంగల్‌:  బీఆర్‌ఎస్‌ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యవహారం సర్పంచ్‌ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాటికొండ రాజయ్య ఓ మహిళా ప్రజాప్రతినిధి ద్వారా డబ్బు ఆశచూపి భర్తను ట్రాప్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆరోపణలు నిజం కాదని, ఎమ్మెల్యేతో రాజీ కుదిరినట్లు బాండ్‌ పేపర్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. 

వేధింపుల విషయంలో మూడు నెలల క్రితం సర్పంచ్‌ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో గ్రామాభివృద్ధికి 20 లక్షలు ఇస్తానని రాజయ్య చెప్పారని సర్పంచ్‌ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు గతంలో అప్పు కింద రూ. 20 లక్షలు తీసుకుంటున్నట్లు బాండ్ పేపర్‌పై సంతకం పెట్టాలని భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.  తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని  చెప్పారు. 

ఈ మేరకు ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు సర్పంచ్‌ నవ్య. తనకు, తన భర్తకు మధ్య ఎమ్మెల్యే రాజయ్య చిచ్చు పెడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే రాజయ్య వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని అన్నారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు.  
చదవండి: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టాల్సిన అవసరం ఉంది: జూపల్లి

కాగా నవ్య ఆరోపణలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్యను సర్పంచ్ నవ్య ఆరోపణపై నో కామెంట్ అంటూ వెళ్ళిపోయారు. నవ్య భర్త ప్రవీణ్ మాత్రం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వకపోగా తమకు 25 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు.  తమ పేరిట గ్రామ పెద్ద మనిషి రూ. 5 లక్షలు తీసుకోవడంతోనే ఈ గొడవ మొదలైందని చెబుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు నవ్య సంతకం పెడితే పది లక్షలు వస్తాయని భార్యకు చెప్పడంతో తాను ఎమ్మెల్యే, వారి అనుచరులతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తుందని తెలిపారు. అసత్య ప్రచారమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)