Breaking News

'పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు తెలుపుదాం..' జనగామ జడ్పీ ఛైర్మన్ ఆడియో లీక్..

Published on Tue, 08/01/2023 - 16:23

జనగామ: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేయదలచిన నాయకులు అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బరిలో నిలబడటానికి నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపుదామని జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది.  పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్ తో ఫోన్‌లో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే..   

జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలబడితే మద్దతు తెలుపుదామని సంపత్ రెడ్డి.. జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని స్థానికుడంటూ పేర్కొంటూ.. సపోర్టు చేద్దామని అనుకున్నారు. నియోజక వర్గంలో ఉన్న 8 మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలతో కలిసి ఓ రిప్రజెంటేషన్‌ని సీఎం కేసీఆర్‌కి పంపించాలని మాట్లాడుకున్నారు. చేర్యాల, మద్దురు, దులిమిట, కొమురవేల్లి నాలుగు మండలాల నుంచి అభ్యర్థులు రాకపోవచ్చని సంపత్‌ రెడ్డి ఫోన్‌లో శ్రీనివాస్‌కు చెప్పారు.


'ఒకవేళ జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి కాకుండా పోచంపల్లి శ్రీనివాస్‌కు సీటు ఇచ్చినా అభ్యంతరం లేదు.  సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఇవ్వమని అడుగుదాం. నువు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఫోను చెయ్యి, మళ్ళీ నాకు  వెంటనే కాల్ చేసి చెప్పు. సారు తోటి మంచిగా మాట్లాడు, మీకు అంతా అనుకూలంగా ఉంటది అందరూ ఒకే అంటారు అని చెప్పు. నేను నర్మెట ZPTC ఫోన్ చేస్తాడు అని చెప్పిన. మన తమ్ముడే, రాజేశ్వర్ రెడ్డి సార్ అంటే పడి చస్తాడు అని చెప్పిన, నువ్వు కూడా అదేవిధంగా మాట్లాడు' అని సంపత్‌ రెడ్డి నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. 

ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్‌.. మధ్యంతర పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు


 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)