Breaking News

వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచేది ఎవరు..?

Published on Sat, 08/05/2023 - 16:09

జడ్చర్ల నియోజకవర్గం

మంత్రి పదవిలో ఉంటూ టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్‌.పి డాక్టర్‌ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్‌ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి.

సి.లక్ష్మారెడ్డి  రెండువేల నాలుగులో టిఆర్‌ఎస్‌ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008  ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ ఐ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌  మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే ఎమ్‌.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్‌ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు.

నాగర్‌ కర్నూల్‌ ఎమ్‌.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్‌ నుంచి ఎమ్‌.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్‌ విప్‌, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్‌ఎస్‌ మూడుసార్లు గెలిచాయి.

ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్‌. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్‌. చంద్రశేఖర్‌ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ నేత ఎన్‌.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు  బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్‌ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్‌ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్‌.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు.

జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)