తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?

Published on Mon, 11/18/2024 - 16:37

చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్‌ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్‌ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.

అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్‌ డీఎంకే, బీజేపీని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్‌ చేశాయి.

అయితే, ఈ కథనాలపై విజయ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్‌ వేదికగా వివరణిచ్చింది.

 

Videos

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)