Breaking News

'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!

Published on Sat, 09/02/2023 - 15:29

పాట్నా: ముంబైలో ముచ్చటగా మూడో సారి సమావేశమైన ఇండియా విపక్ష కూటమి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై జమిలి ఎన్నికల కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో ఇండియా తదుపరి కార్యాచరణ గురించి కీలకమైన సమాచారమిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దానికోసం యావత్ భారత్ దేశం పండుగలా జరుపుకునే గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నట్లు తెలిపారు.       

ఇండియా కూటమి తర్వాతి కార్యాచరణ గురించి కీలక సమాచారమిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశం ముగించుకుని పాట్నా చేరుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ జన్మదినోత్సవాల్లో పాల్గొని వచ్చేనెల ఇండియా కూటమి గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్బంగా ఇదే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం పిలుపునిచ్చిన ప్రభుత్వం వాటి ఎజెండా ఏమిటో చెప్పకపోవడంపై కూడా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకించడంతో షాక్‌కు గురయ్యారన్నారు.  

కేంద్రం ఎప్పుడో నిర్వహిస్తామని చెప్పిన కులగణన గురించి ఇప్పటికీ నోరువిప్పకపోవడం చాల ఆశ్చర్యకరంగా ఉందని వారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపే మేము మా రాష్ట్రంలో కులగణన తోపాటు జనాభా గణన కూడా పూర్తి చేశామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చేందుకే బహుశా వారు ఈ సమావేశాలకు పిలుపునిచ్చారనిపిస్తోందని మేము కూడా ఇదే సమావేశాల్లో జనాభాగణన గురించి కేంద్రాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)