Breaking News

చెప్పుల దండతో ఎన్నికల ప్రచారానికి..

Published on Wed, 04/10/2024 - 08:14

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలు సాగిస్తున్నారు. యూపీలోని అలీగఢ్‌లో ఓ అభ్యర్థి చేస్తున్న ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 

ఎవరి మెడలోనైనా చెప్పుల దండను వేశారంటే వారిని అవమానించారని అర్థం. ఇటువంటి ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే అలీగఢ్‌లో స్వతంత్ర అభ్యర్థి పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పూల దండకు బదులు చెప్పుల దండ వేసుకుని ఓట్లు అడగటాన్ని చూసి, స్థానికులంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.   

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పండిట్ కేశవ్ దేవ్‌కు ఎన్నికల సంఘం చెప్పు గుర్తును కేటాయించింది. ఈ నేపధ్యంలో కేశవ్‌ తన మెడలో ఏడు చెప్పులతో కూడిన దండతో ప్రచారం సాగిస్తున్నాడు. అవినీతిని అరికడతానంటూ అందరికీ చెబుతున్నాడు. 

పండిట్ కేశవ్ దేవ్ సమాచారం హక్కు(ఆర్‌టీఐ) కార్యకర్త. ఆయన భారతీయ హిందూ రాష్ట్ర సేన, అవినీతి నిరోధక సేన అనే సంస్థలను కూడా నడుపుతున్నారు. కేశవ్‌ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు. 

అలీఘర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో అంటే ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా, మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)