Breaking News

మనోహర్‌ ఆస్తి పెరిగింది!

Published on Fri, 04/26/2024 - 12:43

తెనాలిరూరల్‌:  జనసేన పార్టీ తరఫున తెనాలి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన నాదెండ్ల మనోహర్‌ తన ఆస్తి రూ 22.89 కోట్లుగా ప్రకటించారు. 2019 కన్నా రూ. 12 కోట్లు పెరిగినట్టు అఫిడడవిట్‌లో పేర్కొ న్నారు. తనపేరిట రూ. 1,48, 03,300 విలువ చేసే చరాస్తులు ఉండగా తన భార్య పేర రూ. 2,49,33,338, కుమారుడి పేర రూ. 3,63,966 చరాస్తులు ఉన్న ట్టు చూపారు.

తన పేర రూ, 1.95 కోట్ల విలువ చేసే 6.32 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరిట ద్వారకా తిరుమల, కర్ణాటకలలో  రూ. 8.75 కోట్ల విలువ చేసే 8.54 ఎకరాల వ్యవసాయ భూమి, శేరిలింగంపల్లిలో రూ. 2,99,15,000 విలువ చేసే ఫ్లాట్, జూబ్లి హిల్స్‌లో రూ. 4,59,40. 000 విలువ చేసే ప్లాట్‌ ఉన్నట్టు చూపారు. తన పేరిట రూ. 43,96,641 వాహన రుణం ఉండగా తన భార్యకు రూ. నాలుగు కోట్లు రుణం ఉందని చూపారు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని స్పష్టం చేశారు. కాగా 2019లో తన ఆస్తి రూ. 10,68,78,117గా మనోహర్‌ చూపారు.  

తెనాలిలో మనోహర్‌ నామినేషన్‌ 
తెనాలిరూరల్‌:   నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపసాద్, బీజేపీ నేతలు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో ఐతాన గర్‌ లింగారావు సెంటరు నుండి భారీ ర్యాలీగా గాం«దీచౌక్, శివాజీచౌక్‌ల మీదుగా సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తన భార్య మనోహరం, ఆలపాటి రాజా తదితరులతో కలసి రిటరి్నంగ్‌ అధికారి ప్రఖర్‌ జైన్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)