Breaking News

బిహార్‌ పాలిటిక్స్‌.. నితీశ్‌ సర్కారు కీలక నిర్ణయం

Published on Sat, 01/27/2024 - 09:30

పాట్నా: బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది.

రాష్ట్రంలో మొత్తం  22 మంది ఐఏఎస్‌, 79 మంది ఐపీఎస్‌, 45 మంది గ్రూప్‌ 1 స్థాయి అధికారులను నితీశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లుండగా 17 మంది జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)లు ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్‌ సింగ్‌ను సీఎంవో స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు. 

కాగా, జనతాదళ్‌ యునైటెడ్‌ చీఫ్‌, సీఎం నితీశ్‌కుమార్‌ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్‌ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కూటమి కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడం నితీశ్‌ కూటమి మార్చడం ఖాయమన్న వాదనకు ఊతమిస్తోంది.

ఇదీచదవండి.. నితీశ్‌ కొత్త అవతారం 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)