Breaking News

రాజ్యసభలో హైడ్రామా.. డెరెక్‌ ఒబ్రియాన్‌ సస్పెన్షన్‌.. ఆపై ఉపసంహరణ

Published on Wed, 08/09/2023 - 01:31

న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రియాన్‌ సస్పెన్షన్‌ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రియాన్‌ మణిపూర్‌ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్‌ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్‌ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.

సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్‌ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్‌ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్‌ను కోరారు. స్పందించిన ధన్‌ఖడ్‌.. ఒబ్రియాన్‌ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్‌ గోయెల్‌పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్‌క్లిక్‌ వెబ్‌పోర్టల్‌కు నిధులందాయంటూ గోయెల్‌ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు ఈ మేరకు నోటీసు అందజేశారు. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)