Breaking News

ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోండి 

Published on Wed, 11/22/2023 - 04:13

కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్‌ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్‌ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు.

ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్‌ఎస్‌కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు. 

ముషీరాబాద్‌ బాధ్యత నాదే 
రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్‌ఎస్‌ పార్టీ చేసింది ఏమీలేదన్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్‌ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్‌ నియోజవర్గ కన్వి నర్‌ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు