Breaking News

జహీరాబాద్‌ (ఎస్సి) నియోజకవర్గం చరిత్ర ఇదే...

Published on Wed, 08/02/2023 - 11:35

జహీరాబాద్‌ (ఎస్సి) నియోజకవర్గం

జహీరాబాద్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో  భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్‌ నుంచి రెండుసార్లు, గజ్వేల్‌ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి.

బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిల క్యాబినెట్‌ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్‌ జనరల్‌ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్‌) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి  ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు.

జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్‌లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్‌.పి. ఎమ్‌.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్‌ నుంచి లోక్‌సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్‌ 2004లో డాక్టర్‌ వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్‌ కావడంతో హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

జహీరాబాద్‌ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)