Breaking News

హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Tue, 12/26/2023 - 15:14

లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 

'ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. 

స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు.  "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్‌మానస్‌లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. 

ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్‌కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు?


 

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు