Breaking News

‘చీ.. చీ ఆయనేం భర్త?'.. మాజీ ఎంపీ కోడలి సంచలన ఆరోపణలు

Published on Sun, 07/12/2026 - 13:37

ముంబై: ఆయన ఓ కీలక రాజకీయ నేత. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజాప్రతినిధిగా సేవలందించారు. అలాంటి నేత కుటుంబంపై ఇప్పుడు సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కుటుంబంపై ఆయన కోడలు గిరిజా రౌత్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్తతో పాటు అత్తమామలు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

అనేకసార్లు ఆహారం కూడా ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని, క్షుద్రపూజల పేరుతో బలవంతంగా ఆవు మూత్రం తాగించడమే కాకుండా, తన జుట్టును కూడా సేకరించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

గిరిజా రౌత్ ఫిర్యాదు ప్రకారం.. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లిన సమయంలోనే తన భర్త గీతేష్ రౌత్ తనను దగ్గరకు రానివ్వలేదని ఆరోపించారు. శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తే, విదేశాల్లో హనీమూన్ చేసుకుందామని, భారత్‌లో వద్దని చెప్పేవారని పేర్కొన్నారు.

హనీమూన్ ముగించుకుని స్వగ్రామానికి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో అందరి ముందు తనను అవమానించారని, నెమ్మదిగా నడుస్తున్నాననే కారణంతో దుర్భాషలాడారని ఆరోపించారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా తనపై ఆగ్రహం వ్యక్తం చేసేవారని, ఈ విషయాలు తన అత్తకు కూడా తెలుసునని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2018లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా తన భర్త తనను దూరం పెట్టడం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించగా తనపై దాడి చేసి, శారీరకంగా దగ్గరయితే చనిపోతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తనను మానసికంగా వేధించారని, దురుసుగా ప్రవర్తించారని, గృహహింసకు పాల్పడ్డారని, పలుమార్లు ఇంటి నుంచి పంపించేశారని గిరిజా రౌత్ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వినాయక్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు. అయితే ఈ ఆరోపణలపై వినాయక్ రౌత్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)