Breaking News

జనసేనకు ‘మేడా’ గుడ్‌బై

Published on Mon, 10/09/2023 - 04:49

మధురపూడి: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. కోరుకొండలో ఆదివారం ఆయన మీడియా­కు ఈ వివరాలు వెల్లడించారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌.. ఆ పార్టీలో ఉన్న వారికి కూడా ఆత్మ­గౌరవం, ఆత్మాభిమానం ఉంటాయన్న విష­యం తెలుకోలేకపోవడం బాధాకరమని, ఈ కారణంగానే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని గురుదత్త ప్రసాద్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజారాజ్యం, తరువాత జనసేన పార్టీలో కలిపి 16 ఏళ్లు అంకితభావంతో పనిచేశానని చెప్పారు. పార్టీలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని, అంతర్గత ప్రజాస్వామ్యం కొర­వడిందని, ఈ కారణంతోనే మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణతోపాటు తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, రాజురవితేజ, జయలలిత వద్ద చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్‌ సహా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు జనసేనకు గుడ్‌బై చెప్పారని గుర్తు­చేశారు. వారితో పోలిస్తే తాను చాలా చిన్న­వా­డిన­­న్నారు.

తనను నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు తనకు తెలియజేయలేదని, అధిష్టానం అపాయింట్‌మెంట్‌ కోసం 87 రోజులుగా వేచి చూశానని.. చివరకు ఈ అవమానం భరించలేక రాజీనామా చేస్తానని గత నెల 30న లేఖ రాసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదన్నారు. పార్టీ అధ్య­క్షుడు పవన్‌ తీరు కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురుదత్త ప్రసాద్‌ తెలిపారు.

ఆయనతో పాటు జనసేన కోరుకొండ మండలాధ్యక్షుడు మండపాక శ్రీను, రాజానగరం మండలాధ్యక్షుడు బత్తిన వెంకన్నదొర, ఉపాధ్యక్షుడు నాగారపు భానుశంకర్, నాయకులు అడబాల సత్యనారాయణ, కొచ్చెర్ల బాబీతోపాటు 100 మంది జనసేనకు గుడ్‌బై చెప్పారు. త్వరలో మరికొందరు కూడా రాజీనామా చేస్తారని మేడా తెలిపారు. స్థానిక నాయ­కత్వం వన్‌మ్యాన్‌ షోలా వ్యవహరించడం, ఇతర సమస్యల కారణంగా రాజీనామాలు తప్పవన్నారు. ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)