Breaking News

రేపు బీజేపీ తుది జాబితా!

Published on Fri, 03/22/2024 - 03:19

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా శనివారం వెలువడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో శుక్రవారం జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడినట్టు సమాచారం. తెలంగాణ విషయాని కొస్తే..వరంగల్, ఖమ్మం ఎంపీ సెగ్మెంట్లకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు వరంగల్‌ ఖరారు కాగా,  ఇక అది ప్రకటించడమే తరువాయి అని సమాచారం.

ఖమ్మం నుంచి ఎవరిని బరిలో దింపాలనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పేరును పరిశీలనలోకి తీసుకున్నా... పోటీకి ఓ బీఆర్‌ఎస్‌ ఎంపీ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయనకే ఈ సీటు దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి ఖరారైన నల్లగొండ ఎంపీ సీటుతో పాటు ఒకట్రెండు స్థానాల్లో అభ్యర్థుల మార్పు జరగొచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఒకరు పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుండడంతో, ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థి కంటే సదరునేత మెరుగైన వాడిగా భావిస్తే నల్లగొండ అభ్యర్థి మార్పు కూడా ఉంటుందంటున్నారు. తుది జాబితా ప్రకటన ఒకరోజు వాయిదా పడడంతో ఎన్నికల వ్యూహాల ఖరారుకు శనివారం నిర్వహించాల్సిన సమావేశం ఆదివా రానికి వాయిదా పడినట్టు తెలిసింది. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులు, పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.  

వికేంద్రీకరణ వ్యూహం...
బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాల సాధనకు వికేంద్రీకరణ వ్యూహం పార్టీ అమలు చేస్తోంది. ఇక్కడా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇటీవల ఎల్‌బీ స్టేడియంలో దాదాపు 30వేల మంది పోలింగ్‌బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల, జిల్లాస్థాయి అధ్యక్షులతో అమిత్‌షా సమావేశమైన సందర్భంగా పలు సూచనలు చేశారు. ఇందుకు అనుగుణంగా పోలింగ్‌బూత్‌లే కేంద్రంగా ఎన్నికల కార్యకలా పాలపై పార్టీ ప్రత్యేకదృష్టి కేంద్రీకరిస్తోంది. ఒక్కో పోలింగ్‌బూత్‌ పరిధిలో దాదాపుగా 24 పనులు క్రమం తప్పకుండా చేయాలని అమిత్‌షా ఆదేశించినట్టు తెలిసింది.

ప్రధాన పార్టీల కంటే ముందుగానే
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా మిగతా పార్టీలకన్నా బీజేపీనే ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఓ విడత ముందస్తు ప్రచారం పూర్తిచేయడం దీనినే సూచిస్తోంది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్‌ మే 13న ఉన్నందున, ఆ దశ ఎన్నికలప్పుడు మోదీ, అమిత్‌షా, నడ్డా, ఇతర ముఖ్యనేతల విస్తృత ప్రచారం నిమిత్తం రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)