Breaking News

పెళ్లికి వచ్చా.. రాజకీయాలకు కాదు: ఢిల్లీలో ఫడ్నవిస్‌

Published on Tue, 11/26/2024 - 11:24

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనపై పలు చర్చలు జరుగుతున్నాయి.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చానని, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని  పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలవవచ్చంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తనకు ప్రస్తుతం పార్టీ అగ్రనేతలను కలిసే ఆలోచన లేదని ఫడ్నవిస్‌ స్వయంగా  తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా మిత్రపక్షాలు నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. కాగా మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం పదవికి ఆమోదం పొందిందని,  అతనితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా ఉందని సమాచారం. 

ఇది కూడా చదవండి: రాజకుటుంబంలో విభేదాలు.. ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఉద్రిక్తతలు.. 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)