రాష్ట్రంలో పోలింగ్‌ సమయం పెంపు

Published on Thu, 05/02/2024 - 04:58

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు జరుగు తున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. 

ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.

పోలింగ్‌ సమయం పెరిగే ఎంపీ స్థానాలివీ
కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలు

కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే..
    ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్‌ (ఎ స్టీ), ఆదిలాబాద్, బోథ్‌(ఎస్టీ), నిర్మల్, ముథోల్‌.
    పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి.
    వరంగల్‌ లోక్‌సభ స్థానంలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్‌ వెస్ట్, వరంగల్‌ ఈస్ట్, వర్థన్నపేట్‌. 
    మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్‌ (ఎస్టీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), నర్సంపేట్‌.
    ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ).

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)