Breaking News

మీతోనే ఉంటానంటూ శివరాజ్‌ సింగ్‌ భావోద్వేగం

Published on Wed, 01/03/2024 - 15:28

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు పదవిని పొందడానికి వేచి చూస్తూ ఉంటాం..మళ్లీ వెంటనే పదవి చేపట్టడానికి తిరస్కరణకు గురవుతామని ఒకింత భావోద్వేగంతో అన్నారు. మంగళవారం తన సొంద నియోజకవర్గం బధ్నిలో నిర్వహించిన ఓ  సభలో శివరాజ్‌ సింగ్‌ పాల్గొని మాట్లాడారు.

తాను ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు. ముఖ్యంగా తన సోదరీమణుల కోసం ఎప్పడూ అండగా ఉంటానని భావోద్వేగంతో అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లనని. ఇక్కడే జీవిస్తూ.. ఇక్కడే చనిపోతానని  శివరాజ్‌ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మహిళలంతా ‘అన్నా’.. మమ్మల్ని విడిచి.. మీరు ఎక్కడికీ వెళొద్దని పెద్దగా అరుస్తూ కోరారు. కొత్త ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకుపోతుందని తెలిపారు. అయితే కొన్ని పదవుల కోసం వేచి ఉంటామని.. తర్వత  మళ్లీ వాటికి తిరస్కరించబడతామని తెలిపారు.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్‌ మరోసారి బీజేపీ అధిస్టానం మరో అవకాశం ఇస్తుందని పార్టీలో చర్చ జరిగింది. అయితే ముందు నుంచి ఊహించినట్లుగానే బీజేపీ మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం  తెలిసిందే. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు బీజేపీ 163 స్థానాలు గెలుచుకొన్న  విషయం తెలిసిందే. 

చదవండి: Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)