Breaking News

ఈటలకు మల్కాజ్‌గిరి ఫిక్స్‌!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?

Published on Wed, 02/28/2024 - 08:20

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను ఈటల రాజేందర్‌కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్‌ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో ఈటల రాజేందర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్‌గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్‌పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్‌లు వెళ్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్‌ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్య­ర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్‌–జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌–బండి సంజయ్, నిజామాబాద్‌–ధర్మపురి అర్వింద్, మహబూబ్‌నగర్‌–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్‌–ఎం.రఘునందన్‌రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్‌ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)