Breaking News

కేసీఆర్‌ బలం, బలహీనతలు తెలుసు: ఈటల

Published on Wed, 07/05/2023 - 08:54

సాక్షి, హైదరాబాద్‌: తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్‌ షా, జాతీ య సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని. కేసీఆర్‌ బలం, బలహీనతలు తెలుసు. ఒక కార్యకర్తగా నా బాధ్య తను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌రెడ్డి సీనియర్‌ నాయకులు.. ఆయనతో కలిసి పని చేస్తాం’ అని ఈటల పేర్కొన్నారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్‌ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురేయాలని నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లోనే అంకురార్పణ చేశారన్నారు. బండి సంజయ్‌ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచాం. తెలంగాణలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్‌ఎస్‌ గెలిచింది తప్ప కాంగ్రెస్‌ గెలవలేదు. బీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఒక కుటుంబానికి లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటాం. కిషన్‌రెడ్డితో కలిసి శభాష్‌ అనే విధంగా పని చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు.  
చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)