Breaking News

పవన్‌ను బహిష్కరించిన బీజేపీ

Published on Wed, 05/22/2024 - 11:32

రెబల్‌ అభ్యర్థిగా.. పార్టీకి తలనొప్పిగా మారిన భోజ్‌పురి నటుడు, సింగర్‌ పవన్‌ సింగ్‌పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఎన్డీయే కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్‌ వేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. 

వాస్తవానికి.. లోక్‌సభ ఎన్నికల కోసం 200 మందితో కూడిన తొలి జాబితాలోనే పవన్‌ సింగ్‌ పేరును ప్రకటించింది బీజేపీ. కానీ, పశ్చిమ బెంగాల్‌ అసన్‌సోల్‌ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని పవన్‌ సింగ్‌.. బీజేపీకి క్షమాపణలు చెప్పారు. అయితే సొంత రాష్ట్రంలో పోటీ చేసేందుకు మాత్రం ఆయన ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో.. 



బీజేపీ తరఫున బీహార్‌లో పోటీ చేయాలని ప్రయత్నిస్తూనే.. మరోవైపు ఆర్జేడీ తరఫున టికెట్‌ కోసం కూడా యత్నించారు. రెండు వైపుల నుంచి ఆయన సానుకూలత దక్కలేదు. చివరకు.. కారాకాట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన నామినేషన్‌ వేయడమే కాకుండా.. తన తల్లితోనూ ముందు జాగ్రత్తగా మరో నామినేషన్‌ వేయించారు. చివరకు ఉపసంహరణ గడువు ముగిసేనాడు.. తన తల్లితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. ఈ పరిణామాలన్నింటిని బీజేపీ తీవ్రంగా పరిగణించింది.

మరోవైపు పవన్‌ సింగ్‌ను కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయని బీజేపీ.. చివరకు పవన్‌పై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కారాకాట్‌ నుంచి   కేంద్ర మాజీ మంత్రి, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి తరఫున సీపీఐ(ఎంఎల్‌)ఎల్‌ తరఫున రాజా రామ్‌ సింగ్‌ కుష్వాహా బరిలో ఉన్నారు. జూన్‌ 1వ తేదీన కారాకాట్‌కు పోలింగ్‌ జరగనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)