Breaking News

ఫోను వెలుగులో పోలింగ్‌ పార్టీల అవస్థలు!

Published on Mon, 05/20/2024 - 07:34

దేశంలో దాదాపు నెల రోజుల పాటు వివిధ దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేసే పోలింగ్‌ పార్టీలు పలు అవస్థలను ఎదుర్కొంటున్నాయి. పలు పోలింగ్‌ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో పోలింగ్‌ నిర్వహణ సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని సదర్‌  నియోజక వర్గం పరిధిలోగల పలు పోలింగ్ బూత్‌లలో పనిచేస్తున్న పోలింగ్‌ సిబ్బంది మీడియాకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కొన్ని చోట్ల కరెంటు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఫోన్ల  టార్చ్‌ వెలుతురు సాయంతో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల నీటి కుండల స్టాండ్‌లు మాత్రమే ఉన్నాయని, నీటి కుండలు మాత్రం లేవని వాపోయారు. పైఅధికారులకు చెప్పినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.

సదర్ అసెంబ్లీ పోలింగ్ కేంద్రమైన బూత్ 31వ బూత్ ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ ఇబ్రహీం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ ట్రిప్ అవుతోందని, దీంతో పోలింగ్‌కు ఏర్పాట్లు సరిగా చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. బూత్ నంబర్ 39 ప్రిసైడింగ్ అధికారి కమత ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉన్నా బల్బులు లేవని అన్నారు. దీంతో కొవ్వొత్తులు లేదా మొబైల్ టార్చ్‌లతో పోలింగ్‌కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)