Breaking News

‘ఎలక్షన్‌ కమిషన్‌ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Published on Sun, 03/10/2024 - 15:40

సార్వత్రిక ఎ‍న్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు.

ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్‌ కమిషన్‌ బీజేపీ శాఖలా మారింది. టీఎన్‌ శేషన్‌ (మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్‌ కమిషన్‌ ప్రైవేటీకరించారు’ అన్నారు.

ఎలక్షన్‌ కమిషన్‌ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్‌ కమిషన్‌ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ అనుభవించాయి. ఎన్‌సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎ‍న్నికల కమిషన్‌ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు.

ఎన్‌సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్‌ పవార్‌ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్‌ కమిషన్‌ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్‌ పవార్‌ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత​్‌ పవార్‌ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్‌ కమిషన్‌ కేటాయించింది. దీంతో ఉద్దవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)