Breaking News

బీజేపీలోకి జూపల్లి!.. డీకే అరుణ ఆసక్తికర కామెంట్స్‌

Published on Thu, 04/13/2023 - 15:30

సాక్షి, మహబూబ్‌ నగర్‌: తెలంగాణలో పాలిటిక్స్‌ ఒక్కసారిగా వేడెక్కాయి. పలువురు సీనియర్‌ నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ కావాడంతో వారు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, డీకే అరుణ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు మాతో టచ్‌లో ఉన్నారు. జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి ఆహ్వానించాను. ఈ క్రమంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా మధ్య వ్యక్తిగత వైరం లేదు.. పార్టీ పరంగా విభేదాలు మాత్రమే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. 

ఇదే సమయంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై కూడా డీకే అరుణ సంచలన కామెంట్స్‌ చేశారు. కాగా, డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తోంది. పేపర్‌ లీకేజీతో 30 లక్షల మందికి నిరుత్సాహమే మిగిలింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయి. పేపర్‌ లీకేజీలో ప్రభుత్వ పాత్ర ఉందని అనుమానం. పరీక్ష రాసిన ప్రతీ అభ్యర్థికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలి. ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకోవాల్సిన మంత్రులు ఇష్యూను డైవర్ట​్‌ చేస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా డీకే అరుణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన వరంగల్‌లో మొదటి నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే, రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు తాడి ముగ్గురు మృతిచెందడం బాధకరమని అన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)