Breaking News

కాషాయ దళం..కారాలు మిరియాలు!

Published on Mon, 11/06/2023 - 03:06

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీపై పార్టీ పాతకాపులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వలస నేతలకు పెద్దపీట వేశారని, గెలుపోటములతో నిమిత్తం లేకుండా దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటూ కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని వాపోతున్నారు. పార్టీలోని ఒరిజనల్‌ కేడర్‌కు సీట్లు ఇవ్వకుండా జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు మొండిచెయ్యి చూపించాయంటూ కారాలు, మిరియాలు నూరుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాషాయ సిద్ధాంతాలు పాటించే వారు, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారు పనికి రారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రకటించిన 88 అభ్యర్థుల్లో మూడింట రెండు వంతులకు పైగా కొత్తవారికే కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివిధ కారణాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యనేతలు, వారి అనుయాయులకే ఎక్కువగా టికెట్లు దక్కాయని విమర్శిస్తున్నారు.

ఇతర పార్టీల్లోని అవలక్షణాలు బీజేపీకి కూడా అంటుకున్నాయనే అభిప్రాయం కలుగుతోందని, కొందరు గుత్తేదారుల చేతుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడిందంటూ ఆరోపణలకు సైతం దిగుతుండటం గమనార్హం. గత నాలుగేళ్లలో పార్టీలో చేరి జాతీయ కార్యవర్గసభ్యులుగా, ఇతర ముఖ్య పోస్టుల్లో ఉన్న నేతల్లో కొందరు చక్రం తిప్పి తమ అనుచరులు, అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంతో పాత నాయకులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధంగా పార్టీలో పాతకాపులకు ప్రాధాన్యత తగ్గిపోవడం దేనికి సంకేతమని వారు నిలదీస్తున్నారు. ప్రకటించిన 88 మంది అభ్యర్థుల్లో 20 మంది దాకా మాత్రమే పార్టీ సిద్ధాంతాల పునాదిపై సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న వారని, మరో 10 నుంచి 15 మంది దాకా గత ఐదు నుంచి పదేళ్లలోపు పార్టీలో చేరి స్థిరంగా పనిచేస్తున్నారని లెక్కలతో సహా వివరిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)