Breaking News

అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్‌కు ఎదురుదెబ్బ

Published on Thu, 10/19/2023 - 11:22

సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్‌, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. 

ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్‌ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. 

అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్‌ అభ్యర్థన పిటిషన్‌ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై  స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)