Breaking News

షర్మిల ఆత్మ పరిశీలన చేసుకోవాలి

Published on Sun, 04/07/2024 - 03:35

కడప కార్పొరేషన్‌: పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా హితవు పలికారు. గతంలో జగనన్న చెల్లిగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఆమె­కు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షు­రాలిగా వస్తే కనీస స్పందన కూడా లేద­న్నారు.

రాజన్న రాజ్యం స్థాపిస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె అక్కడి ప్రజలను, నాయకులను న­ట్టే­ట ముంచి ఎన్నికల్లో పో­టీచేయకుండా అస్త్ర సన్యా­సం చేసిందన్నారు.  ఇక్కడ తన క్యాంపు కార్యా­లయంలో శనివారం అంజ­ద్‌బాషా మీడియాతో మా­ట్లా­డు­తూ.. రెండ్రోజులుగా షర్మిల వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్‌ జగన్‌ని, కడప ఎంపీ వైఎస్‌ అవి­నాష్‌రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు.

జగన్‌పై అభాండాలు దారుణం..
దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను రెండు­సార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొస్తే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌పై సంబంధంలేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమోగానీ ప్రజలు మర్చిపోలేదన్నారు.

షర్మిల పరిస్థితి చూస్తే తమకే బాధేస్తోందని, జనాలు లేక చాలాచోట్ల మాట్లాడ­కుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్‌ జగన్‌పై అభాండాలు దారుణమన్నారు. ఇష్టానుసారంగా సీఎం జగన్, అవినాష్‌రెడ్డిపై చేస్తు­న్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని ఆమె గ్రహించాలన్నారు.

కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అవినాష్‌రెడ్డిని హంతకుడని మాట్లాడటం అనైతికమని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంజద్‌బాషా చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డిలతో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమ­న్నారు. షర్మిల, సునీత గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)