Breaking News

38 మందితో ఆప్‌ తుది జాబితా

Published on Sun, 12/15/2024 - 16:00

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరి్వంద్‌ కేజ్రీవాల్‌ మరోసారి న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆతిశీ మర్లిన్‌ కల్కాజీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 38 మంది పేర్లతో నాలుగో, చివరి జాబితా ఆదివారం విడుదల చేసింది. ఇందులో ఆరోగ్య మంత్రి  సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేటర్‌ కైలాష్‌ స్థానం, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు షకుర్‌ బస్తీ, ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి మాలవీయ నగర్‌ కేటాయించారు. 

నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 15 మధ్య 25 రోజుల్లో మొత్తం 4 జాబితాల్లో అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఆప్‌ ప్రకటించింది. నాలుగో లిస్టులో 26 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ఈ జాబితాలో ఐదుగురు ముస్లింలు, 10మంది మహిళలకు స్థానం కలి్పంచారు.  డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను పట్‌పర్‌గంజ్‌ నుంచి జంగ్‌పురా అసెంబ్లీ స్థానానికి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రాఖీ బిద్లాన్‌ను మంగోల్‌పురి నుంచి మాదిపూర్‌కు, ప్రవీణ్‌ కుమార్‌ను జంగ్‌పురా నుంచి జనక్‌పురికి, దుర్గేష్‌ పాఠక్‌ను కరవాల్‌ నగర్‌ నుంచి రాజేంద్రనగర్‌కు మార్చారు. 2020లో రాఘవ్‌ చడ్డా రాజేంద్రనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు: కేజ్రీవాల్‌ 
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థే కరువయ్యారని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఎద్దేవా చేశారు. ‘బీజేపీకి సీఎం అభ్యర్థి లేడు. ఢిల్లీపై విజన్‌ లేదు. నాయకుల బృందం లేదు. ప్రణాళిక లేదు. వాళ్ల నినాదం, విధానం, మిషన్‌ ఒక్కటే..అదే కేజ్రీవాల్‌ను ఓడించడం’అని పేర్కొన్నారు. అన్నిటికీ తన వైపే వేలెత్తి చూపుతున్న బీజేపీ నాయకులు ఈ ఐదేళ్లూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)