Breaking News

విపక్షాల కూటమికి షాక్.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Published on Fri, 08/04/2023 - 12:26

న్యూఢిల్లీ: అధికార ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన నేపధ్యంలో హైకోర్టు విపక్షాల కూటమికి నోటీసులు జారీ చేసింది. 

అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా 26 ప్రతిపక్షాలు ఏకమై ఆ కూటమికి 'ఇండియా'(ఇండియాన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్) అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమికి ఇండియా అని నామకరణం చేయడంపై మొదట్లోనే వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఎలెక్షన్ కమిషన్ కు నివేదించినా కూడా వారు స్పందించకపోవడంతోనే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడని హైకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ న్యాయమూర్తి అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ వెంటనే కేంద్ర హోంశాఖ, ఎలక్షన్ కమిషన్, 26 పార్టీలు దీనిపై వివరణ ఇవ్వాల్సిందింగా కోరింది.    

విపక్షాల కూటమికి 'ఇండియా' అని నామకరణం చేయడంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇండియా అనే పేరుని వాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అమాయక ప్రజలను సెంటిమెంటుతో మోసం చేసి అధికారాన్ని చేజిక్కించుకుని మొదట వారిలో రాజకీయ ద్వేషాన్ని రగిలించి రాజకీయ విధ్వంసానికి పాల్పడనున్నారని పిల్ ద్వారా గిరీష్ భరద్వాజ్ పిల్‌లో పేర్కొన్నారు. 

ఇండియా అనేది జాతీయ చిహ్నంలో భాగమని.. విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం 1950 యాక్ట్ నిబంధనల ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాలకు జాతీయ చిహ్నాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం కాబట్టి ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని అందులో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Viral Video : ఎన్‌సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)