Breaking News

జైలు నుంచే పాలన.. వారానికి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ సమీక్ష

Published on Tue, 04/16/2024 - 10:15

ఢిల్లీ: మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'సందీప్ పాఠక్' రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి ప్రతి వారం ఇద్దరు మంత్రులను జైలుకు పిలుస్తారని.. అక్కడే వారి శాఖల పనిని సమీక్షించి వారికి మార్గదర్శకాలు, ఆదేశాలు ఇస్తారని పాఠక్ చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిని వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతించిన సందర్శకుల జాబితాలో మంత్రులు అతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్‌ ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారని పాఠక్ చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎమ్మెల్యేలు మునుపటి కంటే రెట్టింపు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు.. పాఠక్ వెల్లడించారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)